బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కామెడీ చూసి చాలా కాలమవుతోంది. కొబ్బరి మట్ట సినిమాతో చాలా రోజులుగా ఊరిస్తున్న సంపూ వెండితెరపైకి ఎప్పుడు వస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గత ఏడాది నుంచి వాయిదాపడుతోంది. దాదాపు సినిమా రిలీజ్ ఆగిపోయినట్లే అని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. 

ఇక ఇప్పుడు ఫైనల్ గా సంపూ కొబ్బరి మట్ట సినిమాను ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హృదయకాలేయం దర్శకుడు రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించాడు. ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న సంపూ సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారికి వచ్చినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ లో వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ పై ఫ్యాన్స్ కి క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

కుదిరితే జులైలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. సంపూ ఇంతవరకు ఒక్క హృదయ కాలేయం సినిమాతోనే హిట్టందుకున్నాడు. ఆ తరువాత చేసిన సినిమాలు అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. అయినా కూడా సంపూ క్రేజ్ కూడా తగ్గలేదు. కరెక్ట్ సినిమా తగిలితే హిట్టు కొట్టగలనని సంపూ ధీమాతో ఉన్నాడు. మరి కొబ్బరిమట్ట మనోడికి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.