ఎంత మంది ఒప్పుకోకపోయినా దిల్ రాజు నమ్మిందే చేస్తాడు. అనుమానాలు ఎన్ని ఉన్నా తనకు నచ్చిన కథను కరెక్ట్ గా తెరపై చూపించే వరకు నిద్రపోడు. అందుకు ఉదాహరణ 96 రీమేక్. చాలా మంది హీరోల తలుపు తట్టిన ఈ కాన్సెప్ట్ ను ఎట్టకేలకు పట్టాలెక్కించాడు. 

కోలీవుడ్ 96 కథలో త్రిషా విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో దర్శకుడి కోరిక మేరకు శర్వానంద్ - సమంతను దిల్ రాజు ఫిక్స్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ కూడా సగం పూర్తయ్యింది. మెయిన్ గా శర్వానంద్ కి సంబందించిన చాలా సీన్స్ ని సైతం ఫినిష్ చేశారట ఫైనల్ గా షూటింగ్ ను జులై ఎండ్ లో ఫినిష్ చేసి ఆగస్ట్ లో లేదా ఆ తరువాత సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఈ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ కి కూడా నచ్చుతుందని నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి కథను రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ కథకు రీమేక్ కు ఏ మాత్రం తదా రావద్దని  ఒరిజినల్ తమిళ్ దర్శకుడైన సి.ప్రేమ్ కుమార్ ని ఎంచుకున్నాడు. మరి సినిమా దిల్ రాజు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో.. ?