గత కొంత కాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో వర్క్ చేసిన పూరికి ఇప్పుడు హీరో దొరకని పరిస్థితి. అయితే ఫైనల్ గా ఈ డాషింగ్ డైరెక్టర్ యువ కథానాయకుడు రామ్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే మొదట కాన్సెప్ట్ చెప్పగానే సున్నితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ ఆ తరువాత కండిషన్స్ చాలానే పెట్టాడట. డైలాగ్స్ బాలేకపోతే డ్రాప్ అయిపోతా అని ముందు నుంచి చెప్పిన రామ్ ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ ఒకే చేసినట్లు సినిమాను పట్టేలాక్కించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు స్క్రీన్ ప్లే లో ఎదో తక్కువయిందని యువ హీరో చర్చలు జరుపుతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. 

మొత్తానికి కథ సెట్స్ పైకి వెళుతుందని అనుకున్న పూరి మరోసారి స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయినట్లు టాక్. స్రవంతి రవికిశోర్ తో కలిసి పూరి సినిమాను సంయుక్తంగా నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు టాక్. రామ్ చివరగా హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది.