జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి అనంతరం సినిమాల్లోకి వచ్చేస్తారని ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అన్ని విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చే విధంగా తన తరువాత 25 ఏళ్ల జీవితం ప్రజల కోసమే అని తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. 

అయితే పవన్ సినీ కెరీర్ కి సంబందించిన మరొక రూమర్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. పవన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలు బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతాయట. అంటే తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో సినిమాలను నిర్మించేందుకు పవన్ సిద్దమవుతున్నట్లు సమాచారం. 

బడా ప్రొడక్షన్స్ తో కలిసి త్రివిక్రమ్ సమక్షంలో కథలపై చర్చలు జరిపి సినిమాలను నిర్మించేందుకు పవన్ ఆలోచిస్తున్నట్లు టాక్. పాలిటిక్స్ లో కొనసాగాలంటే ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉండక తప్పదు. అందుచేత పవన్ ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.