డబుల్ హ్యాట్రిక్స్ తో 2017 వరకు మంచి హిట్స్ అందుకొని మార్కెట్ పెంచుకున్న న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ గా నిలువగా ఆ తరువాత నాగ్ తో చేసిన దేవదాస్ సినిమా కూడా కలిసిరాలేదు. ఇక ఇప్పుడు ఒక కొత్త టెక్నీక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

నెక్స్ట్ నాని నుంచి జెర్సీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. క్రికెట్ - లవ్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఆ సినిమా కాకుండా నాని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. సిద్దార్థ్ ఆ సినిమాలో విలన్ గా నటిస్తుండగా నానితో నలుగురు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్ వస్తోంది. అసలు విషయంలోకి వస్తే ఆ సినిమాలో నాని 2 డిఫరెంట్ షేడ్స్ తో చేసే యాక్టింగ్ ఆకట్టుకుంటుందని సమాచారం. 

ఓ వైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు నరాలు తెగేంతెలా థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు సీరియస్ మూడ్ లోకి తీసుకెళతాడట. విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. గతంలో 13బి సినిమాతో ఈ దర్శకుడు స్క్రీన్ ప్లేతో ఎంతగా ఆసక్తిని రేపాడో తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత థ్రిల్లర్ కాన్సెప్ట్ ను టచ్ చేసి దానికి కామెడీ అంశాలను యాడ్ చేశాడట. ఈ కాన్సెప్ట్ దర్శకుడికి నానికి కొత్తది. మొదటి సారి చేస్తోన్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి