వరుస డిజాస్టర్స్ తరువాత జెర్సీ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ అందుకున్న నాని ఫుల్ ఫార్మ్ లోకి వచ్చేశాడు. చాలా రోజుల తరువాత హిట్టు రావడమతొ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాను ఈ యువ హీరో మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టనున్నాడు. 

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చ్చింది . ఈ సినిమాలో నాని రైటర్ గా కనిపించబోతున్నాడట. అతని పాత్ర చుట్టూ మరో నాలుగురి జీవితాలు ఆధారపడి ఉంటాయని సమాచారం. 

అనుకోని మలుపుతో నానితో ముడిపడి ఉన్న జీవితాలు ఏ విధంగా మారతాయి  అనే ఒక పాయింట్ సినిమాలో హైలెట్ అని టాక్. విక్రమ్ కె కుమార్ స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 13B - మనం - 24 సినిమాల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు. ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా మరోసారి 13B తరహాలో కొత్తప్రయోగం చేయనున్నారని తెలుస్తోంది. మలయాళం అమ్మాయ్ ప్రియా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.