టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న చిత్రాల్లో సైరా ఒకటి. మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమా దాదాపు 200కోట్లతో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇటీవల 50కోట్ల ఖర్చుతో జార్జియాలో యుద్ధ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. 

కొన్ని వారాల పాటు మెగాస్టార్ ఏ మాత్రం రెస్ట్ లేకుండా ఆ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి సిద్ధమయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే బారి సెట్స్ నిర్మించారు. మెగాస్టార్ ఆరు పదుల వయసులో కూడా చాలా కష్టపడుతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. 

సినిమాలోని అతికీలక సన్నివేశాలను హైదరాబ్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార - తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.