వరుస డిజాస్టర్స్ తరువాత నాని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం జెర్సీ. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఇతర ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆకర్షించింది. అయితే బాలీవుడ్ లో సినిమాను రీమేక్ చేసే అవకాశాన్ని ఎవరికీ దక్కకుండా ముందే దిల్ రాజు సొంతం చేసుకున్నారు. 

అయితే ఇప్పుడు ఆయనతో పాటు అల్లు అరవింద్  కూడా కలిశారు. త్వరలో సినిమాను బాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కించాలని ఈ టాప్ ప్రొడ్యూసర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా నటీనటుల విషయంలో ప్రొడ్యూసర్స్ ఎవరిని అనుకోలేదు. అయితే వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించాలని అనుకుంటున్నారు. 

ఇక తెలుగులో గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన జెర్సీ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు.  సితార ఎంటర్టైన్మెంట్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.