ఫలక్ నుమా దాస్  సినిమాతో దర్శకుడిగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ మరోసారి ఆ కథకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా కూడా విశ్వక్ బిజీ అయ్యాడు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో అలాగే మరో కొత్త నిర్మాతతో సినిమా చేస్తున్నాడు. 

ఈ రెండు సినిమాల అనంతరం విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ 2 సినిమాతో బిజీ కానున్నాడు. ఇటీవల ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత కరాటే రాజు ఈ విషయాన్నీ తెలిపారు. ప్రస్తుతం సీక్వెల్ కోసం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని మరో నాలుగు నెలల్లో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తామని అన్నారు. 

ఇక వచ్చే ఏడాదికి ఎలాగైనా సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతూ.. సినిమాలో ప్రముఖ నటీనటులు ఉండబోతున్నట్లు నిర్మాత వివరణ ఇచ్చారు. ఫలక్ నుమా దాస్ నైజం ఏరియాల్లో మంచి లాభాలను అందించింది.