శంకర్ తెరకెక్కించిన 2.0 మొదటి 5 రోజుల్లో కలెక్షన్స్ ను బాగానే అందుకుంది. అయితే భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించారు కాబట్టి ఇంకా చాలా రాబట్టాలి. గ్రాస్ పరంగా టోటల్ గా 267 కోట్ల కలెక్షన్స్ ను అందుకున్న ఈ సినిమా 140 కోట్ల షేర్స్ ను అందించింది.  వరల్డ్ వైడ్ గా 400 కోట్లను గ్రాస్ ను అందుకున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. 

హిందీలో కలెక్షన్స్ ఎక్కువగా అందుతున్నాయి కానీ తెలుగు తమిళ్ లోనే ఇంకా పెరగాల్సి ఉంది. సినిమాకు 3డి లోనే ఎక్కువగా అందరికి నచ్చింది,. ఇక 2డి లో చూసిన వారి నుంచి నెగిటివ్ టాక్ రావడంతో కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ డల్ అయ్యాయి. తెలుగులో 75 కోట్లకు అమ్మడుపోగా 36 కోట్ల షేర్స్ ను అందించినట్లు సమాచారం. 

ఇక తమిళ్ లో 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు 40 కోట్ల షేర్స్ ను కూడా దాటలేదని తెలుస్తోంది. వీకెండ్ వరకు బాగానే ఉన్నా సోమవారం నాటికీ సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. ఇండియాలో 295 కోట్లకు థ్రియేటికల్ రైట్స్ అమ్ముడుపోగా సగం వరకే షేర్స్ అందాయి. సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అవ్వాలంటే మరిన్ని వసూళ్లు రాబట్టాలి. 

 

 

ఇండియా వైడ్ కలెక్షన్స్(ఐదు రోజులు):   

ఏపీ + తెలంగాణా: 36.08 cr  

తమిళ నాడు: 35.12 cr 

కేరళ: 5.67 cr  

కర్ణాటక: 11.28 cr  

రెస్ట్ ఆఫ్ ఇండియా: 52.66 cr   

ఇండియా టోటల్: 140.81 కోట్ల షేర్