కోడిని కాపాడిన స్నేహా ఉల్లాల్, ప్రియుడు విగ్నేష్ శివన్ బర్త్ డే గోవాలో జరిపిన నయనతార, ఇక సిక్స్ ప్యాక్ బాడీలో సందీప్ కిషన్, హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సయేశా సైగల్...తాజాగా వైరల్ అవుతున్న స్టార్స్ సోషల్ మీడియా పోస్ట్స్ ఏమిటో మీరే ఓ లుక్ వేయండి. 

సోషల్ మీడియా పుణ్యమా అని సెలెబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకునే అవకాశం అభిమానులకు దక్కుతుంది. స్టార్స్ తమ జీవితాలలోని ప్రత్యేక సందర్భాలు, వేడుకలు, సినిమా ముచ్చట్లు ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారికి సంతోషం పంచుతున్నారు. ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న కొన్ని విషయాలు తెగ వైరల్ అవుతూ నెటిజెన్స్ కి బాగా నచ్చేస్తున్నాయి. స్టార్స్ తాజా సోషల్ మీడియా వైరల్స్ ఏమిటో చూద్దాం.. 

నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి వీరిద్దరూ గోవా వెళ్లారు. అక్కడ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

View post on Instagram

ఇక నటి స్నేహా ఉల్లాల్ ఓ కోడికి ప్రాణదానం చేసింది. ఓ వైర్ కాళ్లకు చుట్టుకోవడం వలన నడవలేక ఇబ్బంది పడుతున్న కోడికి, వైర్ తొలగించడం ద్వారా విముక్తి కలిగించింది. 

View post on Instagram

కొత్త పెళ్లి కొడుకు రానా హాట్, మాస్క్ ధరించి కొత్త లుక్ లో సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

View post on Instagram

బెల్లి బ్యూటీ ఇలియానా చిన్నారి పెళ్లి కూతురుగా క్యూట్ ఫోటో పంచుకుంది. బ్రైడ్ ధరించే వైట్ గౌన్ వేసుకొని ఉన్న చిన్ననాటి ఫోటో పోస్ట్ చేసింది. 

View post on Instagram

హీరో సుధీర్ బాబు వి మూవీ కోసం చేసిన యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో పంచుకున్నారు. 

Scroll to load tweet…

హీరో సందీప్ కిషన్ తన సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేశారు. బేర్ బాడీలో కండలు చూపిస్తూ సెగలు పుట్టించారు. 

View post on Instagram

హీరోయిన్ సయేశా సైగల్ మరోమారు తన డాన్స్ స్కిల్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. అమ్మడు హాట్ హాట్ స్టెప్స్ తో మత్తెక్కిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ తండ్రితో రంగస్థలంపై దిగిన ఫోటో పంచుకున్నారు. ఆయన డెత్ యానివర్సరీ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు. 

Scroll to load tweet…

హీరోయిన్ సమంత ఎక్కం వర్చువల్ స్కూల్ ని ప్రోమోట్ చేస్తున్న వీడియో పంచుకుంది. 

View post on Instagram