Asianet News TeluguAsianet News Telugu

#RC16: కొత్త మేకోవర్ తో చరణ్, షూట్ ఎప్పటి నుంచి?, ఫస్ట్ లుక్ ఎప్పుడు?

ఈ సినిమాలో రామ్ చరణ్ కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్.  రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. 
 

Latest Info about Ram Charan #RC16 jsp
Author
First Published Jan 24, 2024, 2:45 PM IST


రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబోలో RC16 ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాను మార్చి రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.  మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ మేకోవర్‌లో కనిపిస్తారట. ఈ సినిమాలో రామ్ చరణ్ కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్.  రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. 

ఇక రామ్ చరణ్ పక్కన ఎవరు హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. కాగా కన్నడ స్టార్ శివ రాజ్‌‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సెషన్స్ మొదలుపెట్టేసారట. పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేజర్ వర్క్ కంప్లీట్ అయ్యిందని మిగతా పార్ట్ వేసవి తర్వాత షూట్ చేస్తారని అంటున్నారు.  . ఈ గ్యాప్‌లో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఏదైమైనా రామ్ చరణ్ బర్త్ డే నాటికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios