హీరోయిన్ సమంతకు క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. ఈ మధ్య వాళ్లతో సమంత అసలు కనబడటం లేదు. దీంతో వారిని సమంత వదిలేశారన్న ప్రచారం జరుగుతుంది.
విడాకుల డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఎక్కువ సమయం మిత్రులతో సన్నిహితులతో గడిపారు. ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి సమంతకు చాలా సన్నిహితురాలు. ఆమెతో కలిసి సమంత వరుస టూర్స్ కి వెళ్లారు. శిల్పారెడ్డితో పాటు సమంతకు అనుక్షణం తోడున్న వ్యక్తులు మరో ఇద్దరు ఉన్నారు. వారు ప్రీతమ్ జుకల్కర్, సాధన. వీరు సమంత స్టాఫ్ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్.
ప్రీతమ్ సమంత స్టైలిష్ట్ కాగా, సాధన మేకప్ ఆర్టిస్ట్. వీరిద్దరితో కలిసి సమంత దుబాయ్ తో పాటు పలు వెకేషన్స్ కి వెళ్లారు. చెప్పాలంటే ప్రీతమ్ విషయంలో సమంత విమర్శలు ఎదుర్కొన్నారు. సమంత-ప్రీతమ్ మధ్య ఎఫైర్ ఉందని, అది తెలిసిన నాగ చైతన్య విడాకులు తీసుకున్నారనే కథనాలు వెలువడ్డాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ప్రీతమ్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక ప్రీతమ్ వివరణ ఇచ్చుకున్నారు. ఆమెను నేను అక్కలా భావిస్తాను, అపార్థం చేసుకోకండని వేడుకున్నాడు.
ఆరోపణల తర్వాత కూడా సమంత ప్రీతమ్ ని దూరం పెట్టలేదు. సాధన, ప్రీతమ్ లతో కలిసి సమంత దుబాయ్ టూర్ కి వెళ్లారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. కాగా వీరిద్దరినీ సమంత దూరం పెట్టారనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. కారణం ఏమిటంటే కొన్నాళ్లుగా ప్రీతమ్,సాధన.. సమంతతో కలిసి కనిపించలేదు. చెప్పాలంటే శిల్పారెడ్డిని కూడా సమంత కలుస్తున్న దాఖలాలు లేవు. వీరందరినీ సమంత దూరం పెట్టారా లేక అనారోగ్యం, షూటింగ్స్ షెడ్యూల్స్ కారణంగా మిత్రులను కలిసే సమయం దొరకడం లేదా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ప్రీతమ్, సాధన, శిల్పారెడ్డిలపై అపరిమిత ప్రేమ చూపించే సమంత వారికి గుడ్ బై చెప్పే ఆస్కారం లేదు. ఇవ్వన్నీ పుకార్లే అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ షూట్లో పాల్గొంటున్నారు. ముంబైలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ కూడా కీలక రోల్ చేస్తున్నారు. అలాగే ఖుషి మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి చిత్ర షూట్ తిరిగి ప్రారంభం కానుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు శివ నిర్వాణ తెలియజేశారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
