తారకరత్న మరణించి రెండు నెలలు గడుస్తున్నా అలేఖ్య రెడ్డి ఆయన్ని మర్చిపోలేకున్నారు. తాజాగా ఆమె మరో వీడియోతో కన్నీరు పెట్టించారు. తారకరత్న మీద తనకున్న ప్రేమను చాటుకుంది.   

తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. ఆమె భర్తను మర్చిపోలేకున్నారు. దానికి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేసిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని అలేఖ్య రెడ్డి ఆ వీడియోకి కామెంట్ జత చేయారు. . అలేఖ్య రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. 

తారకరత్న మీద ఆమెకున్న ప్రేమను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలియజేస్తుంది. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి తరచుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఆ మధ్య ఆమె ఓ సుదీర్ఘ సందేహం పోస్ట్ చేశారు. తనను ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడు. ఎన్ని అవమానాలు అనుభవించారో చెప్పారు. 

తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ప్రస్తావించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎదురైన కష్టాలు వివరించారు. అయిన వాళ్ళే పలు మార్లు బాధపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. 'మన పరిచయం ప్రేమగా మారింది. నా మనసులో ఎక్కడో ఒక సందిగ్దత ఉండేది. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళావు. మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులపాలు చేసింది. కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. 

అయినవాళ్లే పదే పదే మనల్ని బాధపెట్టారు. కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. పిల్లలు పుట్టాక మన జీవితం మారిపోయింది. సంతోషం నిండింది. నువ్వు రియల్ హీరో. మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను...' అని తన భావోద్వేగం బయటపెట్టారు. మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 27న కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 28న మరణించాడు. 

View post on Instagram