లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన మధురమైన గాత్రంతో లతా మంగేష్కర్ తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్నారు.

లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన మధురమైన గాత్రంతో లతా మంగేష్కర్ తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్నారు. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 

ఇటీవల లతా మంగేష్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో ఆమెని కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చేర్చిన విష‌యం తెలిసిందే. ఆమెని ఇంకా ఐసీయూలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. 

ఇప్పటికి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం గురించి హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. లతా మంగేష్కర్ ఆరోగ్యం కిద్దిగా మెరుగైనట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు లతా మంగేష్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అప్డేట్ ఇచ్చారు. 

'లతా దీదీ ఆరోగ్యం కొంచెం మెరుగైంది.. కాకపోతే ఆమె ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. దయచేసి ఎలాంటి ఫాల్స్ రూమర్స్ ప్రచారం చేయొద్దు అని కోరారు. తన అత్యద్భుత గాత్రంతో అలరించిన లతా మంగేష్కర్ ని భారత ప్రభుత్వం 2001లో భారత రత్న అవార్డు తో సత్కరించింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 29న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్ళు. 

Scroll to load tweet…