Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్లో తులసి పూజకు అని సిద్ధం చేసి అనసూయని పూజ చేయమని అడగగా అప్పుడు నందు అదేంటో తెలుసు ప్రతి ఏడాది నువ్వే కదా పూజ చేసేది అనడంతో పండుగ సమయంలో పూజ విషయంలో మళ్లీ గొడవ జరగడం నాకు ఇష్టం లేదు అందుకే అత్తయ్య గారిని చేయమన్నాను అని అంటుంది తులసి. ఇంతలో లాస్య రెడీ అయి అక్కడికి వచ్చి అయ్యో నేను రాకముందే అంత డెకరేషన్ చేసేసారా అనడంతో వెంటనే అంకిత నీ డెకరేషన్ ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు కదా అని అంటుంది. అందుకే మేము చేసేసాము అని శ్రుతి అనగా ఎలా అయితేనేం నేనే కదా పూజ చేసేది అని నువ్వు కాదు మా అమ్మ పూజ చేస్తుంది అంటాడు నందు.
అదేంటి ఇంటి కోడలు నేను కదా అనగా ఇంటి పెద్దగా మా అమ పూజ చేస్తుంది. అయినా పూజ చేయడానికి ఇలా మోడ్రన్ డ్రెస్సులు కాదు పద్ధతిగా రావాలి అంటాడు నందు. అప్పుడు ప్రేమ్ నాన్న మీరు మారిపోయారు నాన్న అనడంతో అందరూ నవ్వుకుంటగా అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు ఇండైరెక్టుగా లాస్య మెసేజ్ సెటైర్లు వేయగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య కావాలనే తులసిని నెక్లెస్ సరిగా వేయమని అనగా అప్పుడు నందు తులసీ మెడలో చూడాల్సిన దీని మెడలో చూడాల్సి వస్తుంది కర్మ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి పూజ చేస్తారు.
అప్పుడు తులసి మహాశివరాత్రి గురించి గొప్పగా వివరిస్తూ ఉంటుంది. మరొకవైపు నందు వాళ్ల కేఫ్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి మీ కేఫ్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది కేఫ్ ను చెక్ చేయాలి అని లోపలికి వెళ్లి కేఫ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ పని చేసే అతను నందు కి ఫోన్ చేసి చెప్పడంతో నందు షాక్ అవుతాడు. ఇప్పుడు తులసి లాస్య నందు అక్కడినుంచి వెళ్లిపోవడంతో మిగిలిన వారు పూజ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏంటి మీ ఓనర్ ఇంకా రాలేదు నన్ను ఏమనుకుంటున్నారు అనడంతో సార్ వస్తున్నారు. సార్ మీరు ఏమనుకోకండి అని అంటాడు నందు. అప్పుడు తులసి వాళ్ళు సార్ మేము కొత్తగా కేఫ్ స్టార్ట్ చేసాము అనగా ఎప్పుడు స్టార్ట్ చేసినా మీ కిచెన్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ని నేను చెక్ చేయాలి మాకు కంప్లైంట్ వచ్చింది అని అంటారు.
అప్పుడు నందు తులసి ఎంత చెప్పిన వినిపించుకోకుండా మాకు కోఆపరేట్ చేయండి లేకుంటే మీకే ప్రాబ్లం అని చెప్పి వెళ్లి ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కావాలనే మంచి ఫుడ్ పక్కన పెట్టేసి కల్తీ చేసిన ఫుడ్ ని అక్కడ పెడతాడు చందు. అప్పుడు కిచెన్ లో ఉన్న ఒక్కొక్క ఐటెం తీసుకుని సీజ్ చేస్తారు. ఇవన్నీ ల్యాబ్ కి పంపుతాము వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ ని పట్టి మా రిపోర్టు ఉంటుంది. ప్రాబ్లం కొంచెం సివియర్ అయితే వెంటనే కేఫ్ ని సీజ్ చేస్తాం అని అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు తులసి ఏం కాదు ఎవరు టెన్షన్ పడకండి మన నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాం అని అంటుంది. మరొకవైపు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ నందు తులసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇంతలో తులసి వాళ్ళు వచ్చి దేవుడికి హారతి తీసుకుంటూ ఉండగా అప్పుడు లాస్య తప్పు మన వైపు పెట్టుకొని దేవుడిని నిందిస్తే ఏం లాభం అని అంటుంది. అప్పుడు ఏం జరిగింది పరందామయ్య అడగగా కేఫ్ మొదలుపెట్టిన మొదట్లోనే మంగళ గీతం పాడాల్సి వస్తోంది అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అలా నెగటివ్ గా మాట్లాడతావు లాస్య అని నందు అనగా ఫుడ్ శాంపుల్స్ తీసుకెళ్లారు రేపు నెగటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి మన కేఫ్ ని క్లోజ్ చేస్తారు అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు నందు, తులసి కలసి లాస్య పై సీరియస్ అవుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక ప్రొఫెషనల్ చెఫ్ ని తీసుకువచ్చాను. అతను ఉంటే వాళ్ళు రాకుండానే ప్రాబ్లంని సాల్వ్ చేసేవాడు అని అంటుంది లాస్య.
అప్పుడు లాస్య అందరూ మౌనంగా ఉన్నారు కదా అంటూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. అప్పుడు అన్ని విషయాలలో తులసి నిర్ణయం తీసుకున్నావు కదా అనగా అవును అని నందు అనడంతో కలిసి కాపురం చేయడానికి పనికిరాని తులసి కలిసి కేఫ్ నడపడానికి పనికొచ్చిందా అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు తులసి గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య మనం ఎవరు అరవాల్సిన అవసరం లేదు శివయ్య ఆల్రెడీ డిసైడ్ చేశాడు. మనమందరం రేపు గుండెలు బాదుకోవాల్సిందే అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
అప్పుడు నోటికి వచ్చిన విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా తులసి దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో నందు తులసి దగ్గరికి వెల్లగా ఎందుకు లాస్య అంత నెగిటివ్గా కామెంట్స్ చేస్తోంది. తను చెప్పినట్టు జరుగుతుందా అనడంతో తనకు ఏ విషయం పాజిటివ్గా ఆలోచించడం రాదు తన గురించి నువ్వు పట్టించుకోకు అంటాడు నందు. తర్వాత అందరూ నిద్ర పోగా తులసి మాత్రం మేలుకొని పూజ చేస్తూనే ఉంటుంది. మరోవైపు తన ప్లాన్ సక్సెస్ అయినందుకు గాయత్రి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తులసి హారతి ఇస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి అందరూ వస్తారు.
