అభిజిత్‌ ఇన్నాళ్ళు సెలెంట్‌గా కనిపించారు. నెమ్మదిగా మెలుగుతూ, గుసగుసలు పెట్టుకున్నారు. లాస్య, హారికలతో కలిసి బాగా చిట్‌చాట్‌ చేసుకునేవారు. పెద్దగా హడావుడి లేకుండా ఉండేవాడు. గేమ్‌ పరంగానూ ఆయనపై కాస్త నెగటివ్‌ టాక్‌ ఉండేది. ఇటీవల నామినేషన్‌ ప్రక్రియలో కూడా అత్యధిక నామినేషన్లు ఆయనకే వేశారు. తాజాగా అభిజిత్‌ కి సంబంధించి మరో కోణం బయటపడింది. 

అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంట రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు. దీంతో ఇప్పుడు మాత్రం లాస్య బిగ్ బాంబ్‌ వేసింది. రేపటి నుంచి వారం రోజులపాటు వంటలు చేయాలని చెప్పింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో చేయాలని వెల్లడించింది లాస్య. లాస్య కోసం అభిజిత్‌ కూడా ఒప్పుకున్నారు. ఆమె వెళ్లడం చాలా బాధగా ఉందని  చెప్పాడు. అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌ పడటంతో వంటల విషయంలో కిచెన్‌లో ఆయన్ని ఓ ఆట ఆడుకోవాలని సభ్యులు భావిస్తున్నారు.