లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నికల వేడిలో మండే సూర్యుడిలా వెలిగిపోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఎన్నికల సంఘం నుంచి వర్మకు ఎదురుదెబ్బ తగిలేలా ఉందని ప్రస్తుత పరిస్థితులు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 22న సినిమా రిలీజ్ కానున్నట్లు వర్మ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాడు. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ సినిమాపై స్పందించారు. సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అని ఢిల్లీలో సినిమాపై పిర్యాదు చేసినట్లు వివరణ ఇచ్చారు. 

ఇక ఎన్నికల కోడ్ ను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని రాజకీయ పార్టీలకు వ్యతిరేఖంగా లేదా అనుకూలంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా రూల్స్ ప్రకారం ఇబ్బందులు తప్పవని రజత్ కుమార్ మాట్లాడారు. దీంతో సినిమా విడుదలపై వర్మ అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. మరి వర్మ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.  

RRR హైలెట్స్: గండరగండుడు తారక్.. మన్యం వీరుడు చరణ్!