విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫొటోలతో పాటలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు భారీగా పెంచుతున్నాడు. రీసెంట్ గా సినిమాలోని ప్రధాన పాత్రల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ మరో రెండు పోటోలను రిలీజ్ చేసి ఆసక్తిని రేపాడు. 

మొదటి ఫొటోలో ఎన్టీఆర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉండగా ఆయనతోనే ఇంట్లో ఒక చోట లక్ష్మి పార్వతి నిలబడి ఎన్టీఆర్ ను చూస్తున్నారు. ఇక మరో ఫొటోలో ఎన్టీఆర్ ఇంట్లో తెలుగు దేశం పార్టీ నాయకులూ అంతా కలిసి భోజనం చేస్తున్నట్లు వర్మ చూపించాడు. సినిమాలో రాజకీయ కోణాల్ని చాలా వరకు వర్మ టచ్ చేశాడని ఈ ఫొటోతో చెప్పకనే చెప్పేశాడు.

 

అయితే చాలా వరకు నెటిజన్స్ వర్మపై ప్రశంసలు కురిపిస్తుంటే ఓ వర్గం వారు విమర్శలు కూడా చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ఫొటోలతో పబ్లిసిటీ చేసుకుంటావ్ సినిమాను త్వరగా రిలీజ్ చేయండి అంటూ వర్మపై కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అసలైన జీవిత చరిత్ర తానే చూపించబోతున్నట్లు వర్మ చెబుతున్నాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.