ఓ వైపు భారీ స్థాయిలో ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలవుతుంటే మరోవైపు రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ ను పెంచేసుకుంటున్నాడు. అసలైన ఎన్టీఆర్ బయోపిక్ ఇదేనంటూ అసలు నిజాల్ని ఇందులో ఉంటాయని చెబుతూ వస్తోన్న వర్మ ఇప్పుడు పాటలను వదులుతూ సినిమాపై మరింతగా అంచనాలను పెంచుతున్నాడు. 

ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని ఎంచుకోవడానికి కారణం ఏమిటని.. అసలే ఆమెనే అన్ని విషయాల్లో ఎందుకు అంటూ పాట రూపంలో చెప్పారు. అందులో రాజకీయాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా కలపడంతో పాట మరింతగా వైరల్ అవుతోంది. వెన్నుపోటు పాటతో ఒక విషయాన్నీ ఎలివేట్ చేసిన వర్మ ఈ పాటతో ఎన్టీఆర్ బలంగా లక్ష్మి పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే ప్రశ్నకు హైప్ క్రియేట్ చేశాడు. 

ఎందుకు అనే ఈ పాటను సిరాశ్రీ రాయగా కళ్యాణి మాలిక్ స్వరపరచి పాడారు. ఇక పాట చివరలో వర్మ కామెంట్స్ కూడా ఘాటుగా ఉన్నాయి. అబద్దాల వెనుక దాగి ఉన్న నిజాలను.. నిజాలకు మసి పూసినట్లుగా ఉన్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే అంటూ వర్మ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక సారి ఆ సాంగ్ వింటే మీకే ఓ క్లారిటీ వస్తుంది.