ఎన్టీఆర్ 'మహానాయకుడు' రిలీజ్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియదు కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎప్పుడు సినిమా థియేటర్ లోకి వస్తుందా అని చూస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ ని బట్టి తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.

'మహానాయకుడు' సినిమా ఫిబ్రవరి 22న వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసిన వెంటనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 14న ఉదయం 9.27 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఇక ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని 'మహానాయకుడు'తో పాటు చూపించబోతున్నాడు వర్మ.

'మహానాయకుడు' సినిమా చూడడానికి వచ్చే ప్రతీ ఒక్కరూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కూడా చూడొచ్చు అంటూ ట్వీట్ చేశాడు. సాధారణంగా ఒక సినిమా స్క్రీన్ చేస్తోన్న థియేటర్ లో మరో సినిమా ట్రైలర్ ని ప్రదర్శించడం సాధారణ విషయమే.

కానీ ఇక్కడ 'మహానాయకుడు' సినిమాతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వదలడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.