సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ వచ్చేలా చూస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో రోజుకొక పోస్టర్, టీజర్ అంటూ హడావిడి చేస్తూనే ఉన్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, రెండు ట్రైలర్లు విడుదల చేసిన వర్మ ఇప్పుడు భారీగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఈవెంట్ కి ''వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్'' అనే పేరు కూడా పెట్టాడు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆడియో రిలీజ్ ఈవెంట్ కడపలో ఒక బహిరంగ సభలో చెయ్యబడుతుందని.. త్వరలోనే ఈవెంట్ డేట్ వెల్లడిస్తామని వర్మ అన్నారు. ''నిజంగా నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ ఆహ్వానం'' అంటూ పోస్ట్ లో రాయించాడు వర్మ. మొత్తానికి వర్మ ఈ ఈవెంట్ తో పెద్ద ప్లాన్ వేసినట్లు ఉన్నాడు.