శుక్రవారం విడుదలవుతుంది అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మొత్తానికి వాయిదా పడేలా ఉంది. ఇక సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఇప్పుడే విడుదల చేయకూదదని ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 3న సినిమాను చూసిన తరువాత తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తులు వివరణ ఇచ్చారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం తెలంగాణ హై కోర్టు సినిమాను విడుదల చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ హై కోర్టు న్యాయమూర్తులు మాత్రం సినిమాను తాము చూసిన తరువాత తీర్పును ఇస్తామని చిత్ర ప్రదర్శనకు నిర్మాత కూడా హాజరవ్వాలని తెలుపడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఇప్పటికే సినిమా ప్రెస్ షోను కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో సినిమా దాదాపు వాయిదా పడ్డట్లే అని టాక్ వస్తోంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.