Asianet News TeluguAsianet News Telugu

ఓవ‌ర్సీస్ లో 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

ఎన్టీఆర్‌ జీవితంలో వెన్నుపోటు వెనుక ఉన్న కథను  చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతో నిన్న శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

Lakshmi's NTR :Overseas Box Office On Fire!
Author
Hyderabad, First Published Mar 30, 2019, 11:03 AM IST

ఎన్టీఆర్‌ జీవితంలో వెన్నుపోటు వెనుక ఉన్న కథను  చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతో నిన్న శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఏపీలో మిన‌హా అన్నిచోట్లా ఈ  చిత్రం రిలీజైంది. ముఖ్యంగా తెలంగాణ‌, ఓవ‌ర్సీస్ లో ఈ సినిమా భారీగానే రిలీజై, మంచి ఓపినింగ్స్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి  రోజు ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చినా.... వివాదాల‌తో వ‌చ్చిన ప్ర‌చారం వ‌ల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ బావున్నాయి.  ముఖ్యంగా  ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమా అమెరికాలో 118 లొకేష‌న్ల‌లో రిలీజైంది. కేవలం.. ప్రీమియ‌ర్ల రూపంలోనే 90కె డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. ఈ మొత్తం బాల‌కృష్ణ  తెరకెక్కించిన `మ‌హానాయ‌కుడు` ప్రీమియ‌ర్ వ‌సూళ్ల (102కె డాల‌ర్లు) స్థాయి ఉండటం చెప్పుకోదగ్గ అంశం.

ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ ని చక్కగా చూపించారంటూ ఆర్జీవీని మెచ్చుకుంటున్నారు. మ‌హాన‌టి చిత్రానికి 268 కె డాల‌ర్లు, క‌థానాయ‌కుడు చిత్రానికి 473 కె డాల‌ర్లు ద‌క్కటంతో... ఓవ‌ర్సీస్ లో క‌థానాయ‌కుడు ప్రీమియ‌ర్ల‌లో ది బెస్ట్ గా నిలిచింది.

అయితే దాదాపు అంత కొత్తవారు, చెప్పుకోదగ్గ  స్టార్ కాస్టింగ్ లేకుండానే ఆర్జీవీ తన పేరుతో , వివాదాలతో  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ ఓవ‌ర్సీస్ లో తేగలిగారు. అసలు రిలీజ్ అవటం సగం సక్సెస్ అయితే ..ఈ రేంజిలో ఓపినింగ్స్ తెచ్చుకోవటం ఆశ్చర్యపరిచే విషయం అంటున్నారు. 

మరో ప్రక్క ఈ సినిమాతో పాటు రిలీజైన మెగా డాటర్ నీహారిక కొణిదెల నటించిన  సూర్య‌కాంతం చిత్రం 55 లొకేష‌న్ల నుంచి 6390 డాల‌ర్లు వ‌సూలు చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios