హాట్ హాట్ అందాలతో యూత్ ని కట్టిపడేసే లక్ష్మీ రాయ్ ధోనీతో ఎఫైర్ పై మీడియాకు అరగంట పైగా లక్ష్మీరాయ్ ఇంటర్వ్యూ నిర్మాతలు తననూ పడక గదికి రమ్మన్నారట.. సహజమేగా... తరచూ వింటున్నాం 

హాట్ హాట్ అందాల ఆరబోతతో యువతను కట్టిపడేసే హాట్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ కు మీడియాలో ఏదో రకంగా వినిపిస్తూ,కనిపిస్తూ ఉండటం ఇష్టం. అందుకే మీడియాతో బాగానే టచ్‌లో ఉంటుంది. అప్పట్లో ధోనితో ఎఫైర్ అని చిన్న స్థాయిలో రూమర్లు వినిపిస్తే దాని గురించి ఓ అరగంట ఇంటర్వ్యూ ఇచ్చింది రాయ్ లక్ష్మీ.

ప్రస్థుతం తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘జూలీ-2’ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో లక్ష్మీ రాయ్ మరోసారి మీడియాలో హైలైట్ అయ్యేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కామన్ అని.. తనను కూడా కొందరు నిర్మాతలు పక్కలోకి రావాలని అడిగారని సంచలన వ్యాఖ్యలు చేసింది రాయ్ లక్ష్మీ. అంతే కాదు.. జూలీ సినిమా రెడీ కాగానే కొత్తగా చాలా విషయాలు చెప్తోంది. కొన్నాళ్ల కిందట డిప్రెషన్లోకి వెళ్లిందట లక్ష్మీ రాయ్. ఒక సినిమా కోసం తాను బరువు తగ్గడం.. పెరగడం.. తగ్గడం వల్ల అనారోగ్యం పాలైందట. తాను ముందు 11 కిలోలు బరువు తగ్గి.. మళ్లీ 17 కిలోలు పెరిగి.. చివరికి ఇంకో 8 కిలోలు బరువు తగ్గి అనారోగ్యం పాలైనట్లు రాయ్ లక్ష్మీ తెలిపింది.

ఇక తాను ఆ రోల్ కోసం ఇలా కష్టపడాల్సి వచ్చిందని.. దాంతో తన ఆరోగ్యం దెబ్బ తిందని.. చివరకు తాను కొన్నాళ్ల పాటు డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయానని లక్ష్మీ రాయ్ చెప్పింది. ఐతే కష్టకాలంలో కుటుంబ సభ్యులు.. స్నేహితులు అండగా నిలవడంతో తాను త్వరగా కోలుకోగలిగానని.. మళ్లీ ఇలాంటి సాహసాలు చేయొద్దని గుణపాఠం నేర్చుకున్నానంటోంది లక్ష్మీ రాయ్.