దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశాడు వర్మ. ట్రైలర్ లో ఎన్టీఆర్ పడ్డ ఆవేదనను చూపించారు. చంద్రబాబుని నెగెటివ్ యాంగిల్ లో చూపిస్తూ ఎన్టీఆర్ కి అతడు చేసిన అన్యాయాన్ని దృశ్య రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు.

ట్రైలర్ లో లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఇంటి ఆడపిల్ల కొడుతూ.. బూతులు తిట్టే సన్నివేశాలను చూపించారు. దీనిపై లక్ష్మీపార్వతి స్పందించింది. ఎన్టీఆర్ ట్రైలర్ పై మీ స్పందన ఏంటని ఆమెని ప్రశ్నిస్తే.. 'నా కన్నీళ్లే సమాధానం' అని చెప్పింది. 

ఆనాడు జరిగిన సంఘటనల్లో తాను ఏది మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. తనను కిడ్నాప్ చేసి కొట్టి, అవమానించి చాలా చేశారని వాపోయింది. అవన్నీ ఎన్టీఆర్ కోసమే భరించినట్లు లక్ష్మీపార్వతి స్పష్టం చేసింది. 

తన బాధ, ఎన్టీఆర్ ఆవేదన బయటకి రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మ్యానేజ్ చేసినట్లు లక్ష్మీపార్వతి వెల్లడించింది. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూశారా..?