నందమూరి ఫ్యామిలి కి సంబంధించిన కాంట్రవర్సీ మ్యాటర్స్ ను బయటపెట్టడంలో ముందుండే లక్ష్మీ పార్వతి గారు మరోసారి వివాదాస్పద ఇంటర్వ్యూతో కొత్త తరహా వార్తలకు తెరలేపుతున్నారు. ఎన్టీఆర్ కూడా తక్కువోడేమి కాదని ఆమె చెప్పిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

రీసెంట్ ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో లక్ష్మీ పార్వతి జూనియర్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను వాళ్ల అమ్మను సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు నేనే పిలిపించాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ఫోటో చింపి పడేశాడు అని ఎమోషనల్ అవుతూ చెప్పారు. అంతే కాకుండా వాడు ఎం తక్కువ కాదు. మినహాయింపు ఏమి లేదు. రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ తల్లి తరచు తనకు ఫోన్ చేసి అత్తయ్యగారు అది కావాలండి అత్తయ్య గారు ఇది కావాలండి అని అడిగేవారని మాట్లాడారు. 

ఇక లోకేష్ కి ఏ భాషా కూడా రాదని పది లక్షలు పెట్టి తెలుగు నేర్పించారని అన్నారు. ఇంగ్లీష్ కూడా సరిగా రాదు అంటూ అలాంటి వ్యక్తిని జనాల మీదకు బలవంతంగా రుద్దితే మంత్రి అవుతాడా అని ప్రశ్నించారు. ఇక జగన్ తన కొడుకుతో సమానం అంటూ ఆయన ఏపీ ఎలక్షన్ లో తప్పకుండా గెలవాలని కోరుకున్నారు.