ఓ జూనియర్ ఆర్టిస్ట్ హల్ చల్ చేసింది, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ముందు హడావిడి చేసింది. అర్ధనగ్నం ప్రదర్శనతో నిరసన తెలిపింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేసింది..? గీతాఆర్ట్స్ వివరణ ఏంటీ...? 

ఓ జూనియర్ ఆర్టిస్ట్ హల్ చల్ చేసింది, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ ముందు హడావిడి చేసింది. అర్ధనగ్నం ప్రదర్శనతో నిరసన తెలిపింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేసింది..? గీతాఆర్ట్స్ వివరణ ఏంటీ...? 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఓ మహిళా ఆర్టిస్ట్ అర్ధనగ్నంగా హల్ చల్ చేసింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా గీతా ఆర్ట్స్ తనను చాలా ఇబ్బంది పెడుతోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించింది. ఉదయం 5.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆమె నిరసన చేపట్టింది గీతాఆర్ట్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది., 

తనకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో, ఆమె గురించి గీతా ఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 

 ఈ ఇష్యూపై గీతాఆర్ట్స్ టీమ్ స్పందించారు. మీడయాలో వస్తున్న కథనాలపై ఈ విదంగా స్పెషల్ అనౌన్స్ చేశారు. బోయ సునీత గారు చేసిన అభియోగాలు నిరాధారమైనవి. గీత ఆర్ట్స్ సంస్తలో లో ఏ సినిమా కూడా ఆమె నటించలేదు. ఆమెకి గీతా ఆర్ట్స్ కి ఏ విధమైన లావాదేవీలు లేవు. ఆమెపై కోర్ట్ లో కేస్ నడుస్తున్నందున ఇంతకు మించి చెప్పలేము. ఈ ఇష్యూ ని అపకపోతే రేపు అందరి ఆఫీస్ ల ముందు ఇదే జరిగే ప్రమాదం ఉంది. కావున నిజానిజాలు సేకరించి న్యూస్ టెలికాస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆమెకు ఎలాంటి బకాయిలు పెండింగ్ లో లేవని గీతా ఆర్ట్స్ మేనేజర్లు తెలిపారు.