కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా కోసం దర్శకదీరుడు రాజమౌళి ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేయనున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న సూర్య నెక్స్ట్ సినిమా తెలుగు టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 

కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న కాప్పాన్ మూవీ తెలుగు టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. తెలుగు అభిమానులు ఈ విషయంలో చిత్ర యూనిట్ పై చాలా రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరిని మెప్పించే విధంగా జక్కన్న ద్వారా సినిమా టైటిల్ లుక్ ని విడుదల చేయనున్నారు. 

27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు కాప్పాన్ సినిమా తెలుగు టైటిల్ ను రాజమౌళి ద్వారా ఎనౌన్స్ చేయనున్నట్లు దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు ఆర్య కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. వీడోక్కడే - బ్రదర్స్ వంటి డిఫరెంట్ సినిమాల అనంతరం సూర్య - కెవి.ఆనంద్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.