Asianet News TeluguAsianet News Telugu

`ఖుషి` స్టోరీ లీక్‌.. అప్పుడు పవన్‌ చేసిందే, ఇప్పుడు విజయ్‌ చేస్తాడట?

పవన్‌, భూమిక జంటగా నటించిన క్లాసిక్‌ మూవీ `ఖుషి` టైటిల్‌తో వస్తున్న నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ, సమంతల `ఖుషి` చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్‌ అయ్యిందంటూ వార్తలొస్తున్నాయి.

kushi movie story leaked pawan kalyan and vijay deverakonda doing same?
Author
First Published Apr 26, 2023, 6:27 PM IST

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ సెన్సిబులిటీస్‌తో సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో దీన్ని రిలీజ్‌ చేయాలని భావించారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సెప్టెంబర్‌ 1న  సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమాని రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందిస్తున్నారట శివ నిర్వాణ. `మహానటి`లో జోడీ కట్టి అలరించిన విజయ్‌ దేవరకొండ, సమంత ఇందులో పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్నారు. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్‌, భూమిక జంటగా నటించిన క్లాసిక్‌ మూవీ `ఖుషి` టైటిల్‌తో వస్తున్న నేపథ్యంలో ఈచిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్‌ అయ్యిందంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌, భూమిక కలిసి నటించిన `ఖుషి` సినిమాకి నిజంగానే పోలికలున్నాయట. లీకైన సమాచారం మేరకు అప్పటి `ఖుషి`లో పవన్‌, భూమిక మధ్య ఈగో సమస్యలున్నట్టుగానే ఈ చిత్రంలోనూ ఈగో సమస్య ఉంటుందట. విజయ్‌, సమంత మధ్య ఈగోతోనే కథ అనేక మలుపులు తిరుగుతుందని సమాచారం. ఇద్దరి మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్‌ పెరిగి పెద్ద గొడవ అవుతుందనే, సినిమాకి అదే మెయిన్‌ పాయింట్‌ గా నిలుస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

అయితే ఇది నిజమేనా? లేక హైప్‌ క్రియేట్ చేయడానికి సృష్టించినా గాసిపా అనేది కూడా అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదేమైనా ఈ నయా లీక్‌తో `ఖుషి` సినిమా వార్తల్లో నిలిచింది. చర్చకి దారి తీసింది. ఇక ఈ సినిమా సమంత కారణంగా చాలా కాలంగా షూటింగ్‌ ఆగిపోయింది. మళ్లీ ఆ మధ్యనే తిరిగి ప్రారంభించారు. సమంత, విజయ్‌ల మధ్య చాలావరకు షూటింగ్‌ చేశారట. కీలక సన్నివేశాలను పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఇదిలా ఉంటే `ఖుషి` సక్సెస్ ఇప్పుడు విజయ్‌, సమంతలకు చాలా ఇంపార్టెంట్‌. అటు దర్శకుడు శివ నిర్వాణకి కూడా. `గీత గోవిందం` తర్వాత విజయ్‌కి హిట్‌ లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన `లైగర్‌` గట్టిగా దెబ్బ కొట్టింది. దీంతో విజయ్‌ చాలా వరకు సైలెంట్‌ అయ్యాడు. సైలెంట్‌గా తన సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇక సమంతకి కూడా `శాకుంతలం`తో గట్టి దెబ్బ పడింది. దీంతో ఈ ఇద్దరికి `ఖుషి` లైఫ్‌ ఛేంజింగ్‌ మూవీ కాబోతుంది. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన `టక్‌ జగదీష్‌` సైతం పరాజయం చెందింది. ఆయన కూడా `ఖుషి`తో మళ్లీ బూస్టప్‌ పొందాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమా వారికి బూస్ట్ ఇస్తుందా? లేదా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios