ఓ వైపు విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు సందీప్ కిషన్ నటిస్తున్న `భైరవకోన` చిత్రంలోని పాట ట్రెండ్ అవుతుంది. ఇంకోవైపు టాలీవుడ్లో కొత్తగా మ్యూజిక్ ఛానెల్ ప్రారంభమైంది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌కి చివరికి చేరుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో మెయిన్ కాస్టింగ్ మొత్తం పాల్గొనడం విశేషం. ఓ గుళ్లో హోమం చేస్తున్న సీన్ చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్లని చిత్రీకరిస్తున్నారట. దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీస్ కోసం సినిమా చేయడానికి తిరిగి వచ్చాము అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.

`ఊరు పేరు భైరవకోన` నుంచి `నిజమే నే చెబుతున్నా` పాట ట్రెండింగ్..
మరోవైపు.. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మంచి మెలోడీస్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన అందించిన పాట ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు బైరవకోన' సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన "నిజమే నే చెబుతున్నా" లవ్ సాంగ్ యూ ట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇన్‌స్టా లో రీల్స్ తో ట్రెండింగ్ లో ఉంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సంగీతం అందించగా , సిద్ శ్రీరామ్ పాడారు.

ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ" నిజమే చెబుతున్నా" సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని ఓన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. రిలీజ్ అయ్యాక చాలా మెస్సేజెస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి ఐ ఆనంద్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్ కి , నిర్మాతలకు థాంక్స్. సిద్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి.ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణి కి కూడా థాంక్స్ చెప్తున్నా. ఈ సాంగ్ మూవీ రిలీజయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను` అని అన్నారు.
టాలీవుడ్‌లో కొత్త మ్యూజిక్ ఛానెల్ `వోక్స్ బీట్జ్` ప్రారంభం..
యూట్యూబ్ లో మనం రోజు....మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్… ఇలా ప్రతి రోజు తెలుగు లో ఎదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటాము. అయితే, ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం తక్కువే అని చెప్పచ్చు. ఈ మధ్య ఈ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సందర్బంగా 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ తదితరులు `షేడ్స్ స్టూడియోస్`, `వోక్స్ బీట్జ్` లను లాంచ్ చేయడంతోపాటు.. ప్రేక్షకులకు ఆలోచింపజేసే విధంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్ పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను విడుదల చేశారు.
దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ: ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్ లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. అలాగే, ఈ పాటలన్ని సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. నటీనటులు అందరు కూడా చాలా సెటిల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అద్భుతంగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీమ్ అందరు కూడా ఇలాగే మంచి మెసేజ్ ఉన్న పాటలు తీస్తూ న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఈ ఛానల్ మంచి ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ప్రతి సాంగ్ లో హుక్ లిరిక్ ఉంటుంది, జారే మనసే జారే సాంగ్ హుక్ లైన్ అద్భుతంగా ఉందని కొనియాడారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. కొత్త టాలెంట్ను తీసుకొని చాలా లొకేషన్స్ లో ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు.
సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ: టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక ఐడెంటిటీ ఇస్తున్న ఉపేంద్ర గారు, దేవి ప్రసాద్ గార్లకు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అన్నారు. `వోక్స్ బీట్జ్ `ఛానల్ కో ఫౌండర్ ఉపేంద్ర రాచుపల్లి మాట్లాడుతూ: పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్న షేడ్స్ స్టూడియోస్ సహకారంతో మేము నలుగురు ఫ్రెండ్స్ కలసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్ తో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను స్టార్ట్ చేశాం. కళ్ళు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందనే కాన్సెప్ట్ తో 'నా మది' పాటను తీశాము. అంతర్వేదిలో 'జాబిలి' అనే సాంగ్ చేసి జాలర్ల అసోసియేషన్ కు కొంత అమౌంట్ డొనేట్ చేశాము. లోకల్ ట్యాలెంట్ ఎంకరేజ్ చేయాలని అక్కడి వారితోనే 'జారే మనసు జారే సాంగ్' చేశాం` అని తెలిపారు.
షేడ్స్ స్టూడియోస్ డైరెక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ: మా దగ్గర ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డి ఐ, వి.యఫ్.ఎక్స్ ఇలా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్స్ సెటప్ ఉంది. మేజర్, భామకలాపం సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. లేటెస్ట్ గా `హరిహర వీరమల్లు` సినిమా సాంగ్ రికార్డింగ్ అయ్యింది. ప్యార్లల్ గా కొత్త ట్యాలెంట్ ను సపోర్ట్ చెయ్యాలనే ఆలోచన ఉన్న మాకు వోక్స్ బీట్జ్ వారు తోడవ్వడం చాలా సంతోషం కలిగించింది. మా టీం అంతా కలసి వోక్స్ బీట్జ్ ఛానల్ కు కంటెంట్ ను ఇచ్చాము. మేము ఆరు కంటెంట్స్ మూడు వీడియో, మూడు ఆడియో లను రెడీ చేసి ఈ రోజు రిలీజ్ చేశాం. ఈ పాటలకు లిరిక్ రైటర్స్, సంగీత దర్శకులు, సింగర్స్ ఇలా అందరూ ఈ పాటలకు ప్రాణం పెట్టి వర్క్ చేశారు, వారికి థ్యాంక్స్.
