సీనియర్ నటి కుష్బూ సోషల్ మీడియా జీవి. ఆమె తరచుగా రాజకీయ మరియు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో సదరు విషయాలపై తన స్పందన తెలియజేస్తూ ఉంటారు. కాగా ఈమె కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరం కానుందట. దానికి కారణం ఆమె గాయాలపాలు కావడమే. నేడు ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ షాక్ అయ్యే ఓ విషయాన్ని పంచుకున్నారు. ఆమె కంటికి గాయం కావడంతో చికిత్స చేయించుకున్నారట. ఓ కంటిపై కట్టుతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేయడం జరిగింది . 

ఆమె కంటి దగ్గర కత్తి దిగడం వలన గాయం అయినట్లు ఆమె చెప్పారు. గాయం పెద్దదే అని తెలుస్తుండగా, కుట్లు కూడా వేశారట. మరి అంత పెద్ద గాయం ఎలా అయ్యింది, సున్నితమైన ప్రదేశంలో కత్తి గాటు ఏ కారణంగా అయ్యింది అనేది తెలియదు. దీనితో ఆమె సోషల్ మీడియా నుండి కొన్నాళ్ళు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. కంటికి గాయం కావడం వలన కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అన్నారు. ఐతే త్వరలోనే తిరిగి వస్తానని ఆమె చెప్పారు. మాస్క్ ధరించి, క్షేమంగా ఉండాలని కోరారు. 

ప్రస్తుతం కుష్బూ సూపర్ స్టార్ రజిని కాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. మాస్ చిత్రాల దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ లో నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన కుష్బూ వయసు మీదపడ్డాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 2000లో కుష్బూ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత అయిన సి. సుందర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగులో ఈమె చివరిసారి, పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీలో నటించడం జరిగింది.