Kurchi Thatha Arrest : కుర్చీ తాత అరెస్ట్... ఎందుకు? ఆయన్ని కావాలనే ఇరికించారా?

 కుర్చీ తాత చిక్కుల్లో పడ్డారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంత రచ్చ చేసినా లేనిది ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. 

Kurchi Thatha Arrest by Police why? NSK

‘కుర్చీ మడతపెట్టి **’ డైలాగ్ తో మస్తు ఫేమ్ సంపాదించాడు షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీతాత (Kurchi Thatha)... కానీ తనకు వచ్చిన ఫేమ్ మళ్లీ దూరమైపోతోంది. తనించి తానే ఆపేరు క్రేజ్ ను దిగజార్చుకుంటున్నారంటున్నారు. కుర్చీతాతకు వచ్చిన ఫేమ్ మాములు కాదు. అలాంటి బ్రేక్ కోసం ఆర్టిస్టులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. 

కానీ పాషాకు ఒక్క  డైలాగ్ తోనే వచ్చేసింది. తన డైలాగ్ ను ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’లో సాంగ్ కు వాడటం సెన్సేషన్ గా మారింది. ఆ మాస్ సాంగ్ కూ మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో కుర్చీ తాత పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. అలాగే సినిమాల్లో మరిన్ని ఆఫర్లు కూడా అందుతున్నాయని తెలుస్తోంది. 

ఈ క్రమంలో కుర్చీ తాత పలు వివాదాలకు కారణమవుతున్నారు. ఆ కారణంతో తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇందుకు కారణం వైజాగ్ సత్య, స్వాతినాయుడు అని తెలుస్తోంది. వాళ్లిద్దరిని కుర్చీతాత ఓ ఇంటర్వ్యూలో దూషించడంతో వారు కేసు పెట్టారంట. దాంతో పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కుర్చీతాతకు థమన్ నుంచి డబ్బులు ఇప్పించిన వైజాగ్ సత్యను తిట్టడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. కుర్చీతాతకు కొందరు యూట్యూబర్లు మందు తాగించి మరీ వారిని దూషించమని చెబుతున్నారంట. పలు వివాదాస్పదమైన ఇంటర్వ్యూలను కుర్చీతాతో చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయనే స్వయంగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా తన డైలాగ్ తో వచ్చిన ఫేమ్ కాస్తా పక్కదారిపడుతుందని అంటున్నారు. 

ఇక కుర్చీతాత రెహమత్ నగర్, కృష్ణకాంత్ పార్కు పరిసరప్రాంతాల్లో తిరుగుతుండే వాడు. పలు మాస్ డైలాగ్స్ చెబుతూ యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించేవాడు. ఈ క్రమంలో పాషా తన లవ్ స్టోరీని ఓసారి చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఈ కుర్చీ డైలాగ్ ను వాడాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. దాంతో పాషా కుర్చీతాతగా మారాడు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios