టాలీవుడ్ అగ్ర దర్శకుడు అల్లు అరవింద్ గతంలో రూ.500 కోట్ల బడ్జెట్ తో రామాయణం తీయబోతున్నట్లు ప్రకటించారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి అరవింద్ ఈ సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇంతలో బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ 'రామాయణం' కథతో సినిమా చేయనున్నట్లు వెల్లడించి అల్లు అరవింద్ కి పెద్ద షాక్ ఇచ్చాడు.

అంతే కాదు 'రామ్ యుగ్' అనే టైటిల్ పేరుతో సినిమా లోగో పోస్టర్ ని విడుదల చేశారు. రొమాంటిక్ సినిమాలు రూపొందించే కునాల్ కోహ్లీ రామాయణం కథతో సినిమా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేటి తరానికి అర్ధమయ్యే భాషలో సరళంగా రామాయణాన్ని చెప్పబోతున్నాను అంటూ కునాల్ వెల్లడించారు. అయితే ఇంకా సినిమాలో నటీనటులు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

మరి ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణం వస్తోంది కాబట్టి అల్లు అరవింద్ ఇక లైట్ తీసుకుంటాడా..? లేక అనుకున్నట్లుగానే భారీ బడ్జెట్ రామాయణం తీస్తారా..? అనేది చూడాలి!