బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన కుమార్ సాయి నేడు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాగైనా కప్ కొడతానన్న కుమార్ సాయి చాలా త్వరగానే ఎలిమినేట్ కావడం జరిగింది. మరో వైల్డ్ కార్డు ఎంట్రీ స్వాతి దీక్షిత్ తో హౌస్ లోకి వచ్చిన సాయి... సెటైర్స్ తో రెచ్చిపోయారు. గతంలో హౌస్ లో తనని టార్గెట్ చేసిన వారికి వస్తూనే పంచ్ లు ఇచ్చాడు. 

 
కుమార్ సాయిని ఎక్కుగా నామినేట్ చేసిన లిస్ట్ లో హారిక ఉన్నారు. చిన్న చిన్న కారణాలు చెవుతూ పరోక్షంగా కుమార్ సాయి ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో కుమార్ సాయి ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. హారిక నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్తుందా.. టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్తుందని అన్నారు.ఇక వేలు దించూ అంటూ గొడవకు దిగిన సొహైల్‌ కి కూడా కుమార్ సాయి పంచ్ వేశాడు.  వేలు సెంటీ మీటర్ దిగింది.. సరిపోతుందా... అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్‌ని అయితే ఓ ఆట ఆడుకున్నాడు. నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర అంటూ గట్టిగా ఇచ్చాడు. 
 
అలా గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఆ ముగ్గురిపై తన మార్కు పంచ్ కక్ష తీర్చుకున్నారు. టైటిల్ పోరులో ఉన్న వీరు తిరిగి ఏమీ అనలేని పరిస్థితి. కాబట్టి ఆ ముగ్గురికి కోసం వచ్చినా అణచుకున్నట్లు ఉన్నారు. ఇక కుమార్ సాయి ఎలిమినేషన్ కూడా అన్ ఫెయిర్ అన్న వాదన వినిపించింది. ఎవరినో సేవ్ చేయడానికి సాయి ని ఎలిమినేట్ చేశారన్న వాదన వినిపించింది.