బిగ్ బాస్ హౌస్ ఈ మధ్య సంచలనాలకు వేదికగా మారింది. టాస్క్స్ గేమ్స్ కోసం ఇంటి సభ్యులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టాస్క్ లో భాగంగా హారిక మెడపై వరకు జుట్టు కత్తిరించుకొని షాక్ ఇచ్చింది. అదే డేరింగ్ స్టెప్ అనుకుంటుండగా అంతకు మించిన నిర్ణయాన్ని నిన్న అమ్మ రాజశేఖర్ తీసుకోవడం జరిగింది. వచ్చే వారం ఎలిమినేషన్ నుండి మినహాయింపు కోసం సగం గుండు చేయించుకున్నాడు. సీజన్ సగం కూడా పూర్తి కాకుండానే కఠిన టాస్క్ లతో బిగ్ బాస్ షోపై ఆసక్తి పెంచేస్తున్నారు. 

ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం తొమ్మిమంది నామినేట్ కాగా నిన్న ముగ్గురు సభ్యులు సేవ్ అయ్యారు. టాస్క్ కోసం వాడిన సుత్తిలో నోయల్ పేరు ఉండగా అతను సేవ్ అయ్యాడు. ఇక మిర్చి పౌచ్ లలో గ్రీన్ మిర్చి ఉన్నవారు సేవ్ అవుతారని చెప్పగా...గ్రీన్ మిర్చి పౌచ్ దక్కించుకున్న లాస్య సేవ్ అయ్యింది. చివరిగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటోలో వారు సేవ్ అవుతారని నాగార్జున చెప్పగా...నోయల్ తెచ్చి అది హారికదిగా రివీల్ చేశాడు. దానితో హారిక సేవ్ అయ్యింది. 

మిగిలిన ఆరుగురు సభ్యులు దివి, ఆరియానా, మోనాల్, కుమార్ సాయి, అభిజిత్, అఖిల్ నందు ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న అఖిల్, అభిజిత్ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఆరియానా తన ప్రత్యేకత చాటుకుంటూ ప్రేక్షకుల అభిమానం పెంచుకుంది. మోనాల్ ప్రేమ వ్యవహారాల రీత్యా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువే...పోతే దివి, కుమార్ సాయి లలో ఒకరు ఎలిమినేట్ కావచ్చని, వీరిద్దరిలో కూడా కుమార్ సాయినే ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని అంటున్నారు.