Asianet News TeluguAsianet News Telugu

‘జాతిరత్నాలు’చూసిన కేటీఆర్‌,ఏమన్నారంటే..

 మంత్రి కేటీఆర్‌ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు. ఆదివారం ‘జాతిరత్నాలు’ చూసిన మంత్రి.. సినిమా చాలా నచ్చిందని, కామెడీ హిలేరియస్‌గా ఉందని ట్వీట్‌ చేశారు. 

KTR Review On Jathi Ratnalu Movie  jsp
Author
Hyderabad, First Published Apr 12, 2021, 1:01 PM IST

 'జాతిరత్నాలు'  విడుదలైన రోజే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రన్ ముగిశాక కూడా అదే జోష్‌లో ఉండటం విశేషం.ఓటీటిలో ఏప్రిల్‌ 11నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమా అక్కడ కూడా రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని అంచనాలు వేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు. ఆదివారం ‘జాతిరత్నాలు’ చూసిన మంత్రి.. సినిమా చాలా నచ్చిందని, కామెడీ హిలేరియస్‌గా ఉందని ట్వీట్‌ చేశారు. 

ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు. థాంక్యూ సార్…మీకు నచ్చడం చాలా హ్యాపీగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, ఈ సూపర్‌ హిట్‌ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం ఏప్రిల్‌ 11నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. 
 
ఇక నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్‌ కేవీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపింది.

ఫలితంగా నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్‌లో రూ.4.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.1.92 కోట్లు, వెస్ట్‌లో రూ.1.58 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, గుంటూరులో రూ.2.08 కోట్లు, నెల్లూరులో 92 లక్షలు వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 32.59 కోట్లు షేర్‌, రూ.52 కోట్ల పైచిలుకు గ్రాస్‌ రాబట్టింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్‌, రూ.70 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios