విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న కృతి స‌న‌న్ న‌టించ‌నుందనే వార్త వినిపిస్తోంది . కొద్ది కాలం క్రితం... విజ‌య్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించారు ఈ సినిమాలోనే హీరోయిన్ గా కృతిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర టీమ్. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని హీరోయిన్  అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. మ‌రోవైపు.. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో అవ‌కాశం ఇవ్వ‌బోతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం.

అంతేకాకుండా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘ఆది పురుష్‌’ చిత్రంలో న‌టిస్తోంది కృతి. ఇందులో సీత పాత్ర పోషిస్తుంది. దాంతో కృతిని తీసుకోవటం ద్వారా తమ ప్రాజెక్టుకు బాలీవుడ్ లో సేలబులిటీ వస్తుందని టీమ్ భావిస్తోంది.  పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్‌’ సినిమా చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్‌.. ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశాలున్నాయి.
 
 డైరెక్టర్ సుకుమార్  ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కలస్మగ్లర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమా కోసం బన్నీ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఊర మాస్ లుక్ లో అదరకొట్టాడు.