మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా నో చెప్పదు. ఇక మొదట్లోనే అవకాశం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఒకే చెప్పేస్తారు. గతంలో 1 నేనొక్కడినే సినిమాతో  అలానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెండితెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ క్రితి సనోన్. అయితే స్టార్టింగ్ లో అమ్మడు హిట్స్ అందుకోలేకపోయింది. 

ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత నెక్స్ట్ సినిమా నాగ చైతన్యతో చేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అడపాదడపా హిట్స్ తో ముందుకెళుతున్న అమ్మడు ఇటీవల మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. 'లూకా చూప్పి' అనే సినిమా 90కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడంతో బేబీ రెమ్యునరేషన్ రేటును పెంచేసింది. 

వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో కోటిన్నరకు తక్కువ చెప్పడం లేదట. మార్కెట్ పెరగడంతో ముందుగానే బేరసారాలకు తావివ్వకుండా ఎమౌంట్ ని ఫిక్స్ చేసిన కృతి ఇక నుంచి ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటాను అని చెబుతోంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న కృతి మరో మూడు ప్రాజెక్టులను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.