కృతి తెలుగులోకి తీసుకురావాలని తెలుగు ఫిల్మ్ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేష్‌లో కలిసి నటించాలనుందనే కోరికని బయటపెట్టింది కృతి.
మహేష్‌బాబు, కృతి సనన్ కలిసి `వన్‌ః నేనొక్కడినే` చిత్రంలో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత `దోచేయ్` సినిమాలో మెరిసింది కృతి. కానీ అది కూడా పరాజయం చెందింది. దీంతో ఇక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. చాలా గ్యాప్‌తో ఈ అమ్మడు మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్ సరసన `ఆదిపురుష్`లో సీత పాత్రలో నటిస్తుంది.
దీంతోపాటు కృతి తెలుగులోకి తీసుకురావాలని తెలుగు ఫిల్మ్ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సుకుమార్, విజయ్ దేవరకొండ చిత్రంలో హీరోయిన్‌గా కృతిని తీసుకోవాలనుకుంటున్నారట. అయితే మహేష్‌లో కలిసి నటించాలనుందనే కోరికని బయటపెట్టింది కృతి. సోషల్ మీడియాలో తన అభిమానులో చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మహేష్ గురించి ఒక్క మాటలో చెప్పాంటే అని అభిమాని అడిగిన ప్రశ్నకి, `బెస్ట్, మై ఫస్ట్ ఎవర్ కో స్టార్. హంబుల్ అమేజింగ్, ఆయనతో మరోసారి వర్క్ చేయాలని ఉంది` అని పేర్కొంది. మరి మహేష్ ఆ అవకాశం ఇస్తాడా? అనేది చూడాలి.
ఇదిలా ప్రభాస్‌తో `ఆదిపురుష్` గురించి చెబుతూ, కెరీర్‌లో ఎంతో స్పెషల్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అని, ఈ సినిమాలో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొంది కృతి సనన్. ప్రస్తుతం కృతి హిందీలో `మిమి`, `హమ్ దో హమారే దో`, `బచ్చన్ పాండే`, `భేడియా` చిత్రాల్లో నటిస్తుంది.
