టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి.యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ కృతిశెట్టినే తమ జోడీగా కావాలంటున్నారు.
టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి.యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ కృతిశెట్టినే తమ జోడీగా కావాలంటున్నారు.
టాలీవుడ్ లో కృతి శెట్టి దూకుడు మామూలుగా లేదు. ఒక్క హిట్ కొడితే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్టే అని హీరోయిన్లు అనుకునే రోజుల్లో.. కృతి శెట్టి ఏకంగా.. వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. అది కూడా తిరుగులేని కాంబినేషన్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా మారిపోయిందనే టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది. వరుసగా ఆఫర్లు ఆమె తలుపు తడుతుంటే.. ఏ ఆఫర్ కు డోర్లు ఒపెన్ చేయాలో తెలియక కన్ ఫ్యూజన్ ఉంది బేబమ్మ.
ప్రస్తుతం కృతీ ఖాతాలో సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తో పాటు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ది వారియర్ సినిమా ఉంది. రామ్ సరసన ఆమె చేస్తున్న ది వారియర్ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకి చేరుకుంది. ఆతరువాత కృతి చేయబోయే సినిమాపై ఇండస్ట్రీ అంతా ఇంట్రెస్ట్ గా.. ఈగర్ గా వెయిట్ చేస్తుంది.
అయితో టాలీవుడ్ టాక్ ప్రకారం కృతీ శెట్టి ఆ తరువాత సినిమాను ఆమె శర్వానంద్ తో చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నట్టుగా సమాచారం. దాదాపు కృతీని ఫిక్స్ చేసినట్టే తెలుస్తోంది.
ఇక అటు శర్వానంద్ విషయానికి వస్తే, వరుస పెయిల్యూర్స్ మధ్య కొట్టుకుంటున్న శర్వానంద్ రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయి గా నటించింది. కాని ఈ సినిమా కూడా శర్వానంద్ కు సూపర్ హిట్ ను ఇవ్వలేకపోయింది. ఆడవాళ్లు మీకు జోహార్లు పర్వాలేదు అనిపించింది. ఇక శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అసలే వరుస ప్లాప్ లతో ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు శర్వానంద్. కొత్తగా ఏ ప్రయత్నం చేసినా.. కలిసి రావడం లేదు యంగ్ హీరోలకు. దాదాపు యంగ్ హీరోల పరిస్థితి అంతా ఇలానే ఉంది. కాని పట్టుదలతో ప్రయత్నాలు చేయడం మాత్రం మానడం లేదు శర్వా. అందుకే ఈసారి లక్కీ హీరోయిన్ కృతిని తమ టీమ్ లోకి తీసుకునట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి మరి.
