Asianet News TeluguAsianet News Telugu

'కస్టడీ'లో కృతి శెట్టి... షాక్ అవుతున్న ఫ్యాన్స్!

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ కస్టడీ. సమ్మర్ కానుకగా విడుదల కానుంది. నేడు ఈ మూవీ నుండి ఆమె లుక్ విడుదల చేశారు. 
 

krithi shetty first look from custody out rises expectations
Author
First Published Jan 18, 2023, 2:36 PM IST


నాగ చైతన్య-కృతి శెట్టి సెకండ్ టైం జతకడుతున్నారు. బంగార్రాజు మూవీలో పల్లెటూరి బావామరదళ్ళుగా ఈ జంట ఆకట్టుకున్నారు. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ మూవీగా నిలిచింది. ఈ సక్సెస్ కాంబో కస్టడీ మూవీతో రిపీట్ అవుతుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేసింది. 

ఆయన పోలీసుల కబంధ హస్తాల్లో బంధీయై ఉన్నాడు. సీరియస్ క్రైమ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రోమోలు చూస్తే తెలుస్తుంది. నేడు విడుదలైన కృతి శెట్టి లుక్ సైతం ఆసక్తి రేపుతోంది. జైలు గోడల మధ్య ఉన్నట్లు ఆమెను పరిచయం చేశారు. లుక్ కూడా చాలా సీరియస్ గా ఉంది. కృతి శెట్టి రేవతి అనే రోల్ చేస్తున్నారని పోస్టర్ లో పొందుపరిచారు. 

నాగ చైతన్య 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదట్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అనుకున్నారు. ప్రోమోలు విడుదలయ్యాక కాదని తేలిపోయింది. మే 12న కస్టడీ మూవీ విడుదల కానుంది. కాగా నాగ చైతన్య, కృతి శెట్టి ప్లాప్స్ లో ఉన్నారు. చైతు గత చిత్రం థాంక్యూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక కృతి విషయానికొస్తే... ఆమె ఏకంగా హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశారు. ఆమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios