Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్‌గా తెలుగులో కొత్త సినిమా ప్రకటించిన కృతి శెట్టి.. బర్త్ డే సర్‌ప్రైజ్‌

కృతి శెట్టి ఒక్కసారిగా తెలుగులో ఖాళీ అయిపోయింది. ఏడాది కాలంగా ఆమె కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. చాలా నిరీక్షణ తర్వాత తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించింది.

krithi shetty finally announces her telugu movie its birthday treat arj
Author
First Published Sep 21, 2023, 5:15 PM IST

తెలుగు తెర బేబమ్మగానే గుర్తిండిపోయింది కృతి శెట్టి. ఇప్పటి వరకు ఆ పేరుని బ్రేక్‌ చేసే పాత్ర పడలేదు. అలాంటి సినిమా రాలేదు. `ఉప్పెన` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయిన ఈ బ్యూటీ నెక్ట్స్ సినిమాల విషయంలో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ని తలక్రిందులుగా మార్చేశాయి. `ఉప్పెన` తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించింది కృతి శెట్టి. కానీ ఒక్క హిట్‌ పడలేదు. `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` ఫర్వాలేదనిపించుకున్నా, మిగలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. రామ్‌తో నటించిన `ది వారియర్స్`, నితిన్‌తో నటించిన `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబ్‌తో చేసిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, అలాగే నాగచైతన్యతో చేసిన `కస్టడీ` మూవీ కూడా డిజాస్టర్‌ అయ్యాయి. 

దీంతో కృతి శెట్టి ఒక్కసారిగా తెలుగులో ఖాళీ అయిపోయింది. ఏడాది కాలంగా ఆమె కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. `ఉప్పెన` తర్వాత ఒప్పుకున్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చింది తప్పా, కొత్తగా టాలీవుడ్‌లో కమిట్‌ కాలేదు. ఆఫర్లు రాలేదా? తను ఒప్పుకోలేదా? అనేది కారణాలు పక్కన పెడితే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో ఖాళీ అయిపోయింది. దీంతో కృతి శెట్టి ఉప్పెనలానే ఎగిసి పడినట్టయిపోయింది. ఇంతలో ఆమె తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యింది. 

దీంతో అక్కడికి షిఫ్ట్ అవుతుందని భావించారు. చాలా రోజులుగా అలాంటి ఫీలింగే కలిగింది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా డిజప్పాయింట్‌తో ఉన్న తన ఫ్యాన్స్ ని ఖుషి చేసే వార్త చెప్పింది. తెలుగులో ఆమె ఆఫర్‌ అందుకుంది. శర్వానంద్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. నేడు(సెప్టెంబర్‌ 21)న కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా ఆమెని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. చిన్న వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో ఆమె కెమెరా ముందు షూటింగ్‌కి రెడీ అవుతున్న విజువల్స్ కనిపించింది. యాక్షన్‌ అని దర్శకుడు చెప్పగానే క్యూట్‌గా స్మైల్‌ ఇస్తూ వెళ్లిపోవడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో చాలా అందంగా ఉంది కృతి శెట్టి. ఆమె ఎంతో బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది. 

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శర్వానంద్‌కి 35వ మూవీ కావడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక కృతి శెట్టి బర్త్ డే సందర్భంగా టీమ్‌ ఆమెకి విషెస్‌ చెబుతూ, `మొదటి చిత్రం `ఉప్పెన`తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్  పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు` అని టీమ్‌ తెలిపింది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. 

Follow Us:
Download App:
  • android
  • ios