అఆల సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి సనన్

First Published 29, Dec 2016, 2:46 PM IST
krithi sanan bumper offer
Highlights
  • అఆల సినిమాలో కృతి సనన్
  • ఆఆలంటే అమితాబ్ ఆమీర్
  • కృతిని వరించిన బంపర్ ఆఫర్

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ట్రెండ్ సెట్టర్ ఆమిర్ ఖాన్ లు... కలసి నటించనున్న తొలి హిందీ సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. ఇందులో హీరోయిన్‌గా మహేష్ బాబు మూవీ ‘1... నేనొక్కడినే’, ‘దోచేయ్‌’ సినిమాల ఫేమ్‌ కృతీ సనన్‌ నటించనుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమిర్‌ఖాన్‌కు జోడీగా కృతిని తీసుకున్నారట.

 

అవకాశం ఇవ్వటమే కాకుండా పరిశ్రమలో స్నేహితుల దగ్గర కృతి నటన గురించి ఆమిర్‌ గొప్పగా చెబుతున్నాడట. ప్రామిసింగ్‌ యంగ్‌స్టర్స్‌లో కృతి ఒకరని అన్నారట. ఓ వైపు అమితాబ్‌ బచ్చన్‌... మరోవైపు ఆమిర్‌ఖాన్‌... ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలసి నటిస్తున్న తొలి సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల హీరోయిన్‌ కృతీ సనన్‌ సంతోషంగా ఉన్నారని ముంబయ్‌ వర్గాల సమాచారం.

 

వచ్చే ఏడాది మార్చిలో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్ర షూటింగ్‌ ప్రారంభించి, ఆ తరువాత ఏడాది 2018 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

loader