పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీలోకి సీనియర్ నటుడు, బిజేపీ నేత కృష్ణంరాజు భార్య శ్యామల దేవి జాయిన్ అవుతున్నారనేది లేటెస్ట్ టాపిక్. జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో మంచి ఫాలోయింది. ఈ జిల్లాల్లో చాలా మంది ఔత్సాహికులు జనసేన పార్టీ మెరుగు కోసం పని చేస్తున్నారు. 

నరసాపురం నియోజకవర్గం నుండి ఈ పార్టీ తరఫున బలమైన నాయకులను నిలబెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణంరాజు భార్య శ్యామల దేవికి నరసాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ టికెట్ ను కేటాయించాలని భావిస్తున్నారు.

దీనికి సంబంధించి కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజుకి మంచి క్రేజ్ ఉండేది. ఎంపీ గా కూడా ఆయన ప్రజలకు సేవ చేశారు. తన భర్త సహాయంతో ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరడానికి శ్యామల దేవి సిద్ధమైందని టాక్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.