సారాంశం
రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిన చిత్రం భక్త కన్నప్ప. కృష్ణంరాజు ఈ చిత్రం శివ భక్తుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప చిత్రం సంచలన విజయం సాధించింది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిన చిత్రం భక్త కన్నప్ప. కృష్ణంరాజు ఈ చిత్రం శివ భక్తుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు.
కన్నప్ప సీక్వెల్ లో ప్రభాస్ నటించాలని ఫ్యాన్స్ కోరిక
అంతటి గొప్ప చిత్రానికి సీక్వెల్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ డిమాండ్ మరింత పెరిగింది. ప్రభాస్ కన్నప్పగా నటించాలని చాలా మంది కోరుకున్నారు. అంతెందుకు.. స్వయంగా కృష్ణంరాజు కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో సీక్వెల్ చేయాలని భావించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలోచన వద్దే ఆగిపోయింది.
కన్నప్ప సీక్వెల్ పై కృష్ణంరాజు ఏమన్నారంటే..
ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ కన్నప్ప చిత్రానికి సీక్వెల్ చేస్తే బాబే చేయాలి అని అన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో కన్నప్ప చేసే ఆలోచన కూడా ఉందని అప్పట్లో కృష్ణంరాజు తెలిపారు. కానీ అనుకోకుండా కృష్ణంరాజు నిర్మాణ భాగస్వామ్యంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించారు.
కన్నప్ప చిత్రంలో ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చేయాల్సిన చిత్రాన్ని విష్ణు చేస్తున్నాడు అని మోహన్ బాబు ఇటీవల తెలిపారు. కానీ కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కనుక కన్నప్ప చిత్రంలో నటించి ఉంటే కృష్ణంరాజు ఈ చిత్రానికి 500 కోట్ల బడ్జెట్ పెట్టేవారు అని.. వసూళ్లు 2000 కోట్ల వరకు ఉండేవి అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
కన్నప్పగా మంచు విష్ణు, 140 కోట్ల బడ్జెట్
మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని సొంత నిర్మాణంలో రూపొందిస్తున్నారు. 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ లాల్ మరో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివ పార్వతులుగా కనిపిస్తున్నారు.