Krishnamraj Look-Radheshyam: ఆధ్యాత్మిక గురువు పరమహంసగా కృష్ణంరాజు.. లుక్‌ అదిరిపోయిందంతే!

`రాధేశ్యామ్‌` సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు లుక్‌ని విడుదల చేశారు. `రాధేశ్యామ్‌`లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన పరమహంస పాత్రలో కనిపించనున్నారు. 

krishnam raju first look out from prabhas starrer radheshyam movie

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `రాధేశ్యామ్‌`(Radheshyam). ప్రభాస్‌ నుంచి వస్తోన్న మరో బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా చిత్రమిది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. పూజాహెగ్డే ఇందులో Prabhas సరసన కథానాయికగా నటిస్తుంది. సైన్స్ కి, జాతకాలకు మధ్య ఉన్న సంఘర్షణని తెలియజేసే చిత్రమిది. దీనికి లవ్‌ స్టోరీని జోడించి దర్శకుడు రాధాకృష్ణకుమార్‌ రూపొందించారు. ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు లుక్‌ని విడుదల చేశారు. 

`రాధేశ్యామ్‌`లో కృష్ణంరాజు(Krishnam Raju) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన పరమహంస పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో Krishnam raju ఓ ఆధ్యాత్మిక గురువుగా కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన కొత్త గెటప్‌లో కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. పాత్రకి పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ కృష్ణంరాజు పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండటం విశేషం. ప్రభాస్‌ ఫ్యాన్‌ని ఖుషీ చేస్తుంది. ఇక వయసు రీత్యా కృష్ణంరాజు నటనకు దూరంగా ఉంటున్నారు. చాలా గ్యాప్‌తో ఆయన నటించిన చిత్రం `రాధేశ్యామ్‌` కావడం విశేషం. ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్‌ని, కృష్ణంరాజుని చూసేందుకు రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. ఈ నెల 23న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం సాయంత్రం `రాదేశ్యామ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేయడం విశేషం. అయితే ఈ ఈవెంట్‌లోనే `రాధేశ్యామ్‌` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ప్రభాస్‌ అభిమానులే గెస్ట్ లుగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతుండటం విశేషం. ఇక భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్ లుక్‌లు, గ్లింప్స్ ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. సినిమా కాన్సెప్ట్ ని తెలియజేస్తూ వచ్చిన `ఈ రాతలే.. `అంటూసాగే పాట ఆద్యంతం కనువిందు చేసింది. యానిమేటెడ్‌ గా డిజైన్‌ చేసిన లిరికల్‌ వీడియో సాంగ్‌ అబ్బురపరించింది. మిగిలిన మూడు పాటలు సైతం శ్రోతలను అలరిస్తున్నాయి. `సాహో` తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం వేచి చూస్తుండటం విశేషం. 

also read: Ram Charan-RRR : రామ్‌చరణ్‌కి వంద కోట్ల ఆఫర్‌.. ముంబయిలో ఫ్యాన్స్ రచ్చకి కారణమదేనా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios