టాలీవుడ్ రెబల్ స్టార్, బీజేపీ సీనియర్ నాయకుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి బంపర్ ఆఫర్ వరించింది. ఆయన తామిళనాడు గవర్నర్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ రెబల్ స్టార్, బీజేపీ సీనియర్ నాయకుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి బంపర్ ఆఫర్ వరించింది. ఆయన తామిళనాడు గవర్నర్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తుండటం విశేషం.
ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు, కృష్ణం రాజు అభిమానులు సంబరపడుతున్నారు. కృష్ణంరాజు చాలా కాలంగా బీజీపీలో ఉన్నారు. ఆయన 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.
ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా ఎంపిక కావడం విశేషం. అయితే దీనిపై ఆయన్ని సంప్రదించగా, ఇంకా తనకు అధికారిక సమాచారం అందలేదని తెలియజేశారు కృష్ణంరాజు. అయితే గవర్నర్ కావాలనేది ఆయన చిరకాల కోరిక. అది నెరవేరబోతుండటం అభినందనీయం.
ఇక కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవ వేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు, 1966లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారికి సమకాలీకులుగా రాణించారు. అగ్ర నటుడిగా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ముఖ్యంగా ఆయన రెబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు కృష్ణంరాజు. తనదైన మేనరిజంతో ఆడియెన్స్ అలరించారు. వయసు భారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం తనయుడు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో `రాధేశ్యామ్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. కృష్ణంరాజు శ్యామలా దేవిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కెరీర్ ఆరంభంలో కృష్ణం రాజు జర్నలిస్టుగా పని చేశారు.
