రామ్ చరణ్ ఓకే అంటే.. నేను రెడీ.. డైరెక్టర్ కృష్ణ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

రామ్ చరణ్ తో  కృష్ణ వంశీ మరో సినిమా చేయబోతున్నారా...? ఆల్ రెడీ వీరి కాంబోలో ఓ డిజాస్టర్ సినిమా రాగా.. మళ్లీ వంశీకి చరణ్ ఛాన్స్ ఇస్తాడా..? ఇంతకీ కృష్ణ వంశీ ఇచ్చిన హింట్ ఏంటి..? 

Krishna Vamsi Next Movie with Ram Charan: Whats in Store JMS

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయారు. నిన్నే పెళ్ళాడుత, సింధుూరం, ఖడ్గం, చందమామ, శ్రీఆంజనేయం, మురారి ఇలా అద్భుతమైన సినిమాలు అందించారు కృష్ణవంశీ.  ఆయన సినిమాలటే గుంపులు గుంపులుగా ప్యామిలీ మెంబర్స్.. వారి మధ్య ఆప్యాయతలు.. అనుబంధాలతో.. సెంటిమెంట్ ను ధారాపాతంగా వాడేస్తారు. అంతే కాదు దానికి తగ్గ యాక్షన్ ను కూడా యాడ్ చేసి.. కామెడీతో టచ్ అప్ చేస్తారు కృష్ణ వంశీ. తనదైన శైలిలో సినిమాలు చేసే ఆ దర్శకుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 

ఫ్యామిలీ ఆడియన్స్ కు కృష్ణ వంశీ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ నిన్నే పెళ్ళాడుతా సినిమా టీవీలో వస్తే.. వదలకుండా చూస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలతో.. భారీ సినిమాలు చేయలేకపోతున్నారు కృష్ణ వంశీ. తాజా సమాచారం ప్రకారం ఆయన రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అందుకోసం ఓ  కథ కూడా రాసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ చిట్ చాట్ లో అభిమాని అడిగిన దానికి సమాధానంగా చెప్పారు. 

రామ్ చరణ్ తో గతంలో గోవిందుడు అందరివాడే సినిమా చేశారు కృష్ణవంశీ.. కాని ఈసినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో అప్పటి నుంచి మళ్ళీ మెగా హీరోల సినిమాలు చేయలేదు. అయితే చరణ్ కు మంచి హిట్ ఇస్తానని గతంలో ప్లామిస్ చేశాడట వంశీ. దానికి తగ్గట్టే ఓ కథ కూడా రాసుకున్నాడట. ఈ ప్రశ్న ఎక్స్ చాట్ లో  ఓఅభిమాని అడిగితే.. అవును కథ రెడీగా ఉంది.. చరణ్ ఓకే అంటే నేను కూడా రెడీనే అని సమాధానం చెప్పారు. 

అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ కృష్ణ వంశీని నమ్మి అవకాశం ఇస్తాడా..? ఈ సినిమా నిజంగా పట్టాలు ఎక్కుతుందా..? ఆ అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios