టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన కృష్ణవంశీ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2007లో చివరగా చందమామ సినిమాతో హిట్టందుకున్న ఆయన ఆ తరువాత చేసిన ఆరు సినిమాలతో అపజయాలను ఎదుర్కొన్నారు. 

అప్పట్లో కుర్ర హీరోలు కృష్ణవంశీ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపేవారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనీ అనుకునే వారు. కానీ ఇప్పుడు ఎవరు చేయడానికి ముందుకు రావడం లేదు. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఆయన ప్రకాష్ రాజ్ తో ఒక డిఫరెంట్ ఎమోషన్ తో కూడిన సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరాఠీలో హిట్టయిన నట సామ్రాట్ అనే కథను రీమేక్ చెయ్యాలని కసరత్తులు చేస్తున్నాడట. 

ఆ ఒరిజినల్ కథకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించగా నానా పటేకర్ ప్రధానపాత్రలో నటించారు. ఒక రంగస్థలం నటుడు తన నటన జీవితానికి ముగింపు పలికినప్పుడు ఆ తరువాత అతనికి నటన పై ఉన్న మక్కువ దాన్ని వదల్లేక అతను సతమతమయ్యే విధానం కథలో ప్రధాన అంశం. ఇప్పుడు అలాంటి ఎమోషన్ కథను కృష్ణవంశీ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ తో చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.